![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -369 లో...దీప తన అసలైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటుంది. దీప అనసూయ దగ్గరికి వెళ్లి.. నా పుట్టుక గురించి చెప్పమని అడుగుతుంది. అనసూయ కంగారు పడుతుంటే దీప కుబేర్ ఫొటో తీసుకొని వచ్చి ఫోటో పై చెయ్ పెట్టి .. ఇప్పుడు నిజం చెప్పమని అంటుంది. దీనికి నిజం ఎవరు చెప్పి ఉంటారు. దీప గురించి ఒక దాస్ కి తప్ప ఎవరికి తెలియదు.. అలా ఎలా చెప్పాడు అని అనసూయ అనుకుంటుంది.
దాంతో అనసూయ ఎమోషనల్ అవుతూ.. కాదే నువ్వు నా తమ్ముడు కూతురివి కాదు వాడికి బస్టాండ్ లో దొరికావు అంట అని అనసూయ చెప్తుంది. దాంతో కార్తీక్ బాబూ చెప్పింది నిజమే అన్నమాట అని దీప అనుకుంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకని అనసూయ అనగానే.. చెప్పే సిచువేషన్ లో నేను లేనని దీప బాధపడుతుంది.
ఆ తర్వాత దీప గుడికి వెళ్లి దీపo పెడుతుంది. అక్కడికి కార్తీక్ వెళ్తాడు. నిన్ను చూస్తుంటే నీకు క్లారిటీ వచ్చినట్లుందని అంటాడు. అవునని దీప అంటుంది. అనసూయ గారిని అడిగావా అని కార్తీక్ అనగానే.. అవునని దీప అంటుంది. మీరు వెళ్లి జ్యోత్స్న గురించి చెప్పొచ్చు కదా అని దీప అంటుంది. వాళ్ళు అప్పుడు అసలైన వారసురాలు గురించి అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలని కార్తీక్ అంటాడు. చనిపోయిందని చెప్పండి ఒకవేళ నేనే అని తెలిసిన వాళ్ళు ఒప్పుకోరని దీప అంటుంది. దాంతో దీపకి కార్తీక్ నచ్చజెప్పుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |